రైతులకు శుభవార్త. మీ భూమి, సైట్ తో సహా మరే ఇతర ప్రదేశాన్ని మీరు ఎవరి సహాయం లేకుండా కొలవవచ్చు. దీనికి ఎలాంటి తాడు లేదా కర్ర అవసరం లేదు. మీ వద్ద మొబైల్ ఉన్నట్లయితే, మీరు మొబైల్ జిపిఎస్ సాయంతో లొకేషన్ ని లెక్కించవచ్చు అది ఎలా అనుకున్నారా. ఇక్కడ ఉంది సమాచారం.
మీ మొబైల్ యొక్క ప్లేస్టోర్ లేదా గూగల్ లో GPS Fields Area measure అని టైప చేసి App ఇన్స్టాల్ చేస్కోండి. లేదా ఇ https://play.google.com/store/apps/details?id=lt.noframe.fieldsareameasure&hl=en_IN&gl=US
లింక్ క్లిక్ చేసి App ఇన్స్టాల్ చేస్కోండి. ఇన్స్టాల్ అయిన్ తర్వాత జిపిఎస్ ఆన్ చేస్కోండి అప్పుడు మనం ఉన్న స్థలం చూపిస్తుంది
జిపిఎస్ ఫీల్ ఏరియా మెజర్ యాప్ ఎడమవైపున మూడు లైన్లపై క్లిక్ చేయాలి. తరువాత అక్కడ సెట్టింగ్ ఎంచుకోండి. Area unit మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెంటీమీటర్ ఓర హెక్టర్. స్క్వేర్ మీటర్ ఎందులో కొల్చుకోవాలనుకున్నారా అది సెలెక్ట్ చేస్కోండి
తర్వాత Start Measuring పైన క్లిక్ చేయండి తర్వాత స్టార్ట్ మెస్సురింగ్ పైన క్లిక్ చేయండి తర్వాత ఎక్కడనుండి ఎక్కడివరకు కొల్చుకోవాలుకున్నారో అక్కడవరకు ల్యాండ్ ఎలా ఉందొ అలాగే మెల్లగా నడవండి. నడిచేటప్పుడు మీ ఫోన్ లాక్ పడకుండా చూసుకోండి. మొబైల్ ఆన్ ఉండాలి. కొలవడం అయింతర్వాత స్టాప్ మెస్సుర్మెంట్ పైన క్లిక్ చేసి డన్ పైన క్లిక్ చేయండి
అప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నాయో చూస్తారు. అంతే కాదు, పాదాల్లో స్కవయర్ ఎంత ఉందో కూడా కనిపిస్తుంది. జిపిఎస్ సాయంతో మీరు మీ భూమిని ఖచ్చితంగా లెక్కించవచ్చు. జిపిఎస్ ఫీల్డ్ ఏరియా మెజర్ యాప్ భూమిని మాత్రమే కాకుండా మీరు ఉన్న ఇంటి స్థానాన్ని కూడా లెక్కించగలదు.